'పేదల సొంత ఇంటి కల నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం'
SRCL: పేదల సొంత ఇంటి కల నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం కొత్తపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో శనివారం ఆయన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి నూతన వస్త్రాలు అందజేశారు.