జిల్లాలో యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా

జిల్లాలో యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా

CTR: జిల్లా కేంద్రమైన చిత్తూరు ఇసుక అక్రమ తవ్వకాలకు కేంద్రమైంది. ఇక్కడ డంప్ చేసిన ఇసుకను తమిళనాడుకు తరలిస్తున్నారు. చిత్తూరు మండలం తమిళనాడుకు సరిహద్దుగా ఉండటంతో అక్రమార్కులకు అక్రమ రవాణా సులభతరమవుతోంది. అడవిచేను డంప్ నుంచి రాత్రిపూట ఇసుక లోడ్‌తో టిప్పర్లు, కాట్పాడి, పరదరామి ప్రాంతాలకు తరలుతోంది. అయినప్పటికీ అధికారులు చూసి చూడనట్లు ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి.