రాష్ట్రస్థాయి పోటీలకు వేపరాళ్ల విద్యార్థులు ఎంపిక
ATP: నెట్‌బాల్ క్రీడలో వేపరాళ్ల జడ్పీహెచ్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్-14, 17, 19 విభాగాల్లో నలుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు రాష్ట్రస్థాయిలో ఆడనున్నారు. వీరంతా నవంబర్ 7న విజయవాడలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్నారు. గ్రామం నుంచి ఇంతమంది ఎంపిక కావడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.