VIDEO: మార్కెట్ యార్డులో రైతుల అవస్థలు
GDWL: అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డులో సౌకర్యాల లేమితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, కనీస విశ్రాంతి గదులు లేక మండుటెండలో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్ని బ్యాగులు, తరుగు పేరుతో తమను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిసి నష్టపోతామని, అధికారులు తక్షణమే స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు.