లారీ బోల్తా.. డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలు..

లారీ బోల్తా.. డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలు..

KMM: తల్లాడ మండల కేంద్రంలో శుక్రవారం ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడింది. పాల్వంచ నుంచి పుల్లల లోడుతో వైరా వెళ్తున్న లారీ రింగ్ రోడ్డు సెంటర్ వద్ద అదుపుతప్పి కింద పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.