VIDEO: ఆటో బోల్తా.. రైతుకు గాయాలు
KRNL: ఆదోని పట్టణంలోని మాధవరం రోడ్డులో పత్తి లోడుతో వెళ్తున్న ఆటో బోల్తా పడటంతో ఆలూరు మండలం మరకట్టు గ్రామానికి చెందిన రైతు ఉసేనప్ప గాయపడ్డారు. ఆయన గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రోడ్డు గుంతలమయం కావడమే ప్రమాదానికి కారణమని ఆటో డ్రైవర్ తెలిపారు. గత 10 రోజుల్లో ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయన్నారు.