కురుమూర్తిస్వామికి రూ.24.83 లక్షల ఆదాయం
MBNR: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం ఆలయ సిబ్బంది.. భక్తులు కానుకలు సమర్పించిన హుండీని లెక్కించారు. ఇందులో రూ.24,83,628 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఛైర్మన్ గోవర్దన్‌రెడ్డి, ఈవో మధనేశ్వరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ పరిశీలకులు శ్రీనివాస్, ఆలయ పాలక మండలి సభ్యులు భారతమ్మ, బాదం వెంకటేశ్వర్లు, పూజారులు తదితరులు పాల్గొన్నారు.