గూగుల్ నుంచి ఏఐ-ఆధారిత గ్లాసెస్

గూగుల్ నుంచి ఏఐ-ఆధారిత గ్లాసెస్

టెక్ దిగ్గజం గూగుల్ వచ్చే ఏడాదిలో తన మొదటి ఏఐ-ఆధారిత స్మార్ట్ గ్లాసెస్‌ను విడుదల చేయనుంది. వీటిని తయారు చేసేందుకు శాంసంగ్, జెంటిల్ మాన్‌స్టర్స్‌తో కలిసి పనిచేస్తోంది. జెమిని ఏఐ అసిస్టెంట్‌తో కూడిన ఆడియో-ఓన్లీ గ్లాసెస్, నావిగేషన్ కోసం డిస్‌ప్లే-ఎనేబుల్డ్ గ్లాసెస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. మెరుగైన ఏఐ టెక్నాలజీతో వీటిని తయారు చేస్తోంది.