'జలధారతో భూగర్భ జలాలు పెంచుతాం'
ప్రకాశం: టంగుటూరు మండలం వల్లూరులో సోమవారం మంత్రి స్వామి, జిల్లా కలెక్టర్ రాజాబాబు జలధార కార్యక్రమంలో పాల్గొన్నారు. చెరువులో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రి చీరను సమర్పించారు. జలధారతో భూగర్భ జలాలు పెంచాలని సీఎం చంద్రబాబు సంకల్పమని ఆయన అన్నారు. కరువు ప్రాంతమైన జిల్లాలో భూగర్భ జలాలు పెంచి జిల్లాను సస్యశ్యామలంగా చేస్తామన్నారు.