పదవి కాదు.. పార్టీయే ముఖ్యం: డీకే శివకుమార్

పదవి కాదు.. పార్టీయే ముఖ్యం: డీకే శివకుమార్

కర్ణాటక రాజకీయాల్లో సీఎం మార్పుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నాకు సీఎం పదవి గానీ, మరే ఇతర ఉన్నత పదవి గానీ ముఖ్యం కాదు. పార్టీలోని ప్రతి ఒక్కరితో కలిసికట్టుగా పనిచేసి, రాష్ట్రాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే ప్రధానం' అని అన్నారు. సరైన సమయంలో పార్టీ అధిష్టానమే సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.