నేడు జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం

KMR: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు వినతులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ప్రజలు తమ సమస్యలను అధికారులకు తెలియజేయడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.