VIDEO: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

VIDEO: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

W.G: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద పోటెత్తింది. యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం వద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీనితో అధికారులు లంక గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. వరద ప్రవాహం తగ్గే వరకు మత్స్యకారులకు చేపల వేటను నిషేధించారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.