దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటన
ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో దేశంలో గంటకు 185 నుంచి 230 కి.మీ వేగంతో పెను గాలులు వీస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. అలాగే 325 దేశీయ, 61 అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. కాగా ఈ తుఫాన్ రేపు తీరం దాటనుంది.