వారి సిద్ధాంతం దేశాభివృద్ధి కాదు: కేంద్రమంత్రి
మావోయిస్టు పార్టీ చైనా నుంచి వచ్చిందని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. చైనా నుంచి వచ్చిన పార్టీకి ఇక్కడి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. మావోయిస్టు పార్టీ సిద్దాంతం దేశాభివృద్ధి కాదని.. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలపై తిరుగుబాటు చేయడమే వారి సిద్ధాంతమని మండిపడ్డారు. మావోయిస్టు పార్టీల మూల సిద్ధాంతాలు మనమంతా అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు.