EVM గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

EVM గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

ASF: జిల్లా కేంద్రంలోని ఓటింగ్ మిషన్ గోదామును కలెక్టర్ వెంకటేష్ దోత్రే గురువారం సందర్శించారు. భద్రత ఏర్పాట్లు, CC కెమెరా పర్యవేక్షణ, అగ్నిమాపక పరికరాలు, యంత్రాల నిల్వ విధానం అంశాలను సమీక్షించారు. EVMలు అత్యంత భద్రతతో సంరక్షించబడాలని, అనధికార ప్రవేశాన్ని నిరోధించాలని ఆదేశించారు. ఈ తనిఖీ ప్రతి నెల నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగం అన్నారు.