భార్యను చంపేందుకు ప్రయత్నించిన భర్త
ప్రకాశం: ఆదివారం నాగులుప్పలపాడులో తాగిన మైకంలో భర్త వీరరాఘవులు తన భార్య గుర్రపశాల హైమావతిపై కత్తితో పైశాచికంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న హైమావతిని చుట్టుపక్కల వారు చూసి 108కు సమాచారం అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.