రామన్నగూడెంలో CMRF చెక్కుల పంపిణీ

రామన్నగూడెంలో CMRF చెక్కుల పంపిణీ

MLG: రామన్నగూడెంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ నవీన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి లబ్ధిదారులకు రూ.69,000 విలువైన చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ వైస్ ఛైర్మన్ బాలరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్ది రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.