జేసీ సోదరులను కలిసిన జీవానంద రెడ్డి
ATP: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేలు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిని వ్యాలీ గ్రీన్ గార్మెంట్ అధినేత పెరుమాళ్ల జీవానంద రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం ఉదయం వారి స్వగృహానికి వెళ్లిన ఆయన జేసీ సోదరుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు.