VIDEO: ముందస్తు చర్యలపై కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం

HYD: కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల దృష్ట్యా ముందస్తు చర్యలపై కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని ఇంఛార్జ్ మంత్రులు, అధికారులకు సూచించారు. రాబోయే మూడు రోజుల పాటు సిబ్బంది సెలవులను రద్దు చేయాలని ఆదేశించారు.