'పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి'

ATP: వినాయక చవితి పండగ సందర్భంగా శనివారం గుత్తిలో గౌతమీపురి నగర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక మండపాల ఏర్పాటు కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఎస్సై సురేష్ మాట్లాడుతూ.. నిమర్జనం రోజున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.