డోంగ్లి మార్కెట్లో తగ్గిన శనగల ధర..!
KMR: డోంగ్లీ, మద్నూర్ మండలాల్లోని మార్కెట్లో శనగల ధర తగ్గిందని వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం క్వింటాకు రూ. 5,200 ధర పలుకుతోందని పేర్కొన్నారు. గత వారం రోజులుగా ధర క్వింటాకు రూ. 100 తగ్గిందన్నారు. కాగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లేక ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ ధర ఎక్కువగా ఉందన్నారు.