ఆస్తి పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలి: కమిషనర్

NLR: బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఆస్తి పన్నుల వసూళ్లపై సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ బాలకృష్ణ ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులతో ఆయన సోమవారం నిర్వహించిన సమావేశంలో, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డబుల్ ఎంట్రీ, అన్ అసెస్డ్, అండర్ అసెస్డ్, నాట్ ట్రేసబుల్ అసెస్మెంట్ నంబర్‌లను గుర్తించి, రెవెన్యూ పన్నుల డేటాను పునరుద్ధరించాలని సూచించారు.