పద్మశ్రీ కనకరాజు కన్నుమూత

పద్మశ్రీ కనకరాజు కన్నుమూత

ADB: పద్మశ్రీ కనకరాజు గుస్సాడి కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచారు. వజైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన కనకరాజు గుస్సాడి నృత్యం శిక్షణలో పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నారు. కేంద్రం ప్రభుత్వం కనకరాజును 2021 పద్మశ్రీతో సత్కరించింది. ఆయన మరణం ఆదివాసులకు తీరని లోటుగా మిగిలిపోనుంది. నేడు అంతక్రియలు ఆయన స్వగృహంలో నిర్వహిస్తుంచనున్నారు.