బస్సు ప్రమాద ఘటనపై స్పందించిన మోదీ
ASR: చింతూరు బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, అలాగే గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ఈ ఘటన పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.