ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు: మందకృష్ణ
TG: పోలీస్ లాకప్ డెత్‌లో మరణించిన కర్ల రాజేష్ మృతిపై కొనసాగుతున్న విచారణలో జాప్యం జరుగుతుందని మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ అధికారిగా డీఎస్పీ జి.రవి బాధ్యతలు చేపట్టి రెండు నెలలు అవుతున్న కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదన్నారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఒత్తిడి మేరకే రీ పోస్టుమార్టం జరిగిందన్నారు. ఇక దాని రిపోర్టు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదన్నారు.