ఓయూ ఎంబీఏ పరీక్షల ఫీజు స్వీకరణ

ఓయూ ఎంబీఏ పరీక్షల ఫీజు స్వీకరణ

HYD: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షల ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ నాలుగో సెమిస్టర్ మేకప్, ఇన్స్టంట్ పరీక్షా ఫీజును ఈనెల 30వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.800 అపరాధ రుసుముతో వచ్చే నెల 3వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు.