10 నుంచి రాష్ట్ర స్థాయి పోటీలు
GNTR: పెదకూరపాడులో రాష్ట్రస్థాయి అండర్-20 క్రీడా పోటీలను ఈ నెల10 నుంచి నిర్వహిస్తామని గుత్తా కవిత, రాము తెలిపారు. రాష్ట్ర స్థాయి వాలీబాల్ పురుషుల విభాగంలో మందడి శివరామ కాళిబాబు మెమోరియాల్ సహకారంతో డే అండ్ నైట్స్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. రాయపూడి పాపయ్య-వెంకటసుబ్బమ్మ మెమోరియల్ ఆధ్వర్యంలో అండర్-20 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు పురుష, మహిళల విభాగంలో నిర్వహిస్తున్నామన్నారు.