VIDEO: కంచెట్టి, ఇమ్మడి గోపికి ఎమ్మెల్యే నివాళి
NZB: కాంగ్రెస్ సీనియర్ నాయకులు కంచెట్టి గంగాధర్, ఇమ్మడి గోపిల మరణం పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే డా. ఆర్.భూపతి రెడ్డి అన్నారు. శనివారం డిచ్పల్లిలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమ ప్రారంభానికి ముందు మృతుల చిత్రపటాలకు నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.