జిల్లాలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం
సత్యసాయి: జిల్లాలో గురువారం రాత్రి పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా కనగనపల్లిలో 29.8 మిల్లీమీటర్లు, అత్యల్పంగా పరిగిలో 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని జిల్లా ప్రణాళికాధికారి విజయ్‌కుమార్ తెలిపారు. వానలతో పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖాధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు సమాచారం.