తమది రైతు పక్షపాత కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే

తమది రైతు పక్షపాత కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే

ATP: తమది రైతు పక్షపాత కూటమి ప్రభుత్వమని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురంలోని నారాయణపురం రైతు భరోసా కేంద్రం వద్ద 371 మంది రైతులకు రూ.24.73 లక్షల మెగా చెక్కును ఆయన అందజేశారు. ఒక్కో రైతుకు పీఎం కిసాన్‌తో కలిపి రూ.7 వేలు అందిస్తున్నామని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని వ్యాఖ్యానించారు.