100 శాతం లక్ష్యాల సాధనకు కృషి చేయాలి: కలెక్టర్
PDPL: మహిళల ఆర్థిక అభివృద్ధికి, 100 శాతం లక్ష్యాల సాధనకు సెర్ప్ సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. ఇవాళ ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం బ్యాంకు లింకేజీ కార్యకలాపాలలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత సంవత్సరం కూడా బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, రికవరీలో అగ్రస్థానంలో ఉంచాలని సూచించారు.