ఒంటిమిట్ట సీఐగా వెంకటేశ్వర్లు బాధ్యతలు
KDP: ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్‌కు నూతన CIగా వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఆయనను ఒంటిమిట్టకు నియమించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడటమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటానని, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.