అప్పుల బాధతో ఆత్మహత్య

అప్పుల బాధతో ఆత్మహత్య

NLR: కలివెలపాలెంలో చాంద్ బాషా (43) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈయన బేల్దారి పనులు చేస్తుంటారు. ఇటీవల అప్పులు చేయడంతో మానసిక ఇబ్బందులకు గురయ్యారు. మామిడి తోటలో పురుగుల మందు తాగి ఇంటికి వెళ్లారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు. నెల్లూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.