HPV వ్యాక్సిన్ వేయించుకోవాలి: DMHO
PDPL: 14 సం. నిండిన బాలికలకు మార్చి 8న జిల్లా ఆసుపత్రితో పాటు రామగుండం జనరల్ ఆసుపత్రి, మంథని, సుల్తానాబాద్ CHCలలో HPV వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు DMHO డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన సంబంధిత వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ వ్యాక్సిన్ తోడ్పడుతుందన్నారు.