పేకాట ఆడుతున్న ముగ్గురు అరెస్ట్
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని కాశిరెడ్డి కాలనీలో పేకాట శిబిరంపై ఎస్సై టీ. శ్రీరామ్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి రూ.7320 స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో పేకాట శిబిరాలు కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.