ఈనెల 18న మంచిర్యాలలో మినీ జాబ్ మేళా.!

ఈనెల 18న మంచిర్యాలలో మినీ జాబ్ మేళా.!

MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో ఈనెల 18న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ తెలిపారు. ముత్తూట్ గ్రూప్‌లో ఖాళీగా ఉన్న 15 పోస్టుల భర్తీ కొరకు ఉదయం 10:30 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హులైన నిరుద్యోగ పురుష అభ్యర్థులు తమ ధృవపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.