సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్
SRD: పటాన్‌చెరు జాతీయ రహదారి నుంచి మున్నూరు కాపు సంఘం ఫంక్షన్ హాల్ వరకు నూతనంగా సీసీ రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పనులు పూర్తయితే స్థానికులకు రోడ్డు సమస్య తీరుతుందన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్‌కు ఆయన సూచించారు.