'రేపు పలు సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ అంతరాయం'

'రేపు పలు సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ అంతరాయం'

NRML: ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ రాంసింగ్ తెలిపారు. నెలవారి మరమ్మతులలో భాగంగా శనివారం ఉ.8 నుండి మ.12 గంటల వరకు ఖానాపూర్ పట్టణంలోని 33/11 కేవీ సబ్ స్టేషన్, సుర్జాపూర్, సత్తనపల్లి, బీర్నంది, పాత ఎల్లాపూర్, లింగాపూర్ సబ్‌స్టేషన్లలలో మరమ్మతులు ఉంటాయన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలన్నారు.