చినగదలి పీటీఎంలో జిల్లా కలెక్టర్

చినగదలి పీటీఎంలో జిల్లా కలెక్టర్

VSP: పిల్లల లక్ష్య సాధనకు తల్లిదండ్రుల సహకారం అత్యవసరమని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అన్నారు. చినగదలి మండలం తోటగరువు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో గురువారం జరిగిన మెగా పేరెంట్ -టీచర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులే పిల్లలకు తొలి గురువులని, వారి అలవాట్లు పిల్లలపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. పిల్లలతో రోజూ ప్రత్యేక సమయం గడపాలని తెలిపారు.