బోరు మోటార్ ధ్వంసం.. విలువైన పరికరాలు చోరీ

బోరు మోటార్ ధ్వంసం.. విలువైన పరికరాలు చోరీ

NRML: బాసర మండలంలోని మైలాపూర్‌కు చెందిన గంగాధర్ వ్యవసాయ బోరు మోటార్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మోటార్‌లో విలువైన పరికరాలను ఎత్తుకెళ్లారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారే ఈజీ మనీ కోసం కేబుల్ చోరీలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దొంగతనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, పోలీసులు గస్తీ పెంచాలన్నారు.