చిట్టడవి మాటున సాగు కాలువ..!

NLG: నాగార్జునసాగర్ నిండుకుండను తలపిస్తోండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా పొలాలకు నీరు పారే పంట కాలువలు అధ్వానంగా ఉన్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కాలువలకు గట్ల సమస్యలు, మరికొన్ని చోట్ల కాలువ పాయల్లో చెట్లు ఏపుగా పెరిగి చిట్టడవులను తలపిస్తున్నాయంటున్నారు.