వ్యాయామశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
AKP: అనకాపల్లిలోని వేల్పుల వీధిలోని శ్రీ రామా దేవ వ్యాయామ సంఘానికి చెందిన నూతన జిమ్‌ను ఎమ్మెల్యే రామకృష్ణ ప్రారంభించారు. జిమ్‌లో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యాయామ పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత ఆరోగ్యంగా, శారీరకంగా దృఢంగా ఎదగాలంటే వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.