'అంబర్‌పేటలో నకిలీ ఆధార్ కార్డుల గుట్టు రట్టు'

'అంబర్‌పేటలో నకిలీ ఆధార్ కార్డుల గుట్టు రట్టు'

HYD: అంబర్‌పేటలో నకిలీ ఆధార్ కార్డుల గుట్టును చార్మినార్ జోన్ పోలీసులు రట్టు చేశారు. నెట్ సెంటర్ ముసుగులో ఆధార్ వివరాలను అక్రమంగా మారుస్తూ నకిలీ కార్డులు తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రజలు తమ వ్యక్తిగత వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, కేవలం అధికారిక కేంద్రాలనే ఆశ్రయించాలని అధికారులు సూచించారు.