VIDEO: గుంతలమయంగా మారిన.. జాతీయ రహదారి
వరంగల్ పట్టణ కేంద్రంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి గుంతలమయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ద్విచక్ర వాహనదారులు గుంతలు కనబడక ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని స్థానికులు ఇవాళ కోరారు.