కోటగిరి గట్ల వైభవం.. నేటికీ సజీవం

KNR: జిల్లా సైదాపూర్ మండలం సర్వాయపేట కోటగిరి గట్లలోని చారిత్రక కట్టడాలు నేటికీ సజీవంగా ఉన్నాయి. కొత్త, పాత ఖిల్లాలు, బలిష్టమైన రాతిగోడలు, రహస్య సొరంగాలు, బయ్యన్న విగ్రహం, చెరువులు, ఆలయాలు సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను చాటుతున్నాయి. కోనేర్లు, కందకాలు, హనుమాన్, శివాలయాలు, ఎల్లమ్మగుడి నిర్మాణాలు ఆనాటి వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి.