VIDEO: రోడ్డు ప్రమాదం.. దంపతులకు గాయాలు..!
NDL: ఆళ్లగడ్డ పట్టణ శివారులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు గాయపడ్డారు. రైల్వే ఎర్రగుంట్ల నుంచి ప్రసాద్ తన భార్యతో కలిసి బైక్పై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన కారు వారిని ఢీకొంది. ఈ ఘటనలో దంపతులు తీవ్రంగా గాయపడటంతో వారిని వెంటనే ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.