రాజానగరం వైసీపీ పరిశీలకునిగా తోట

రాజానగరం వైసీపీ పరిశీలకునిగా తోట

E.G: రాజానగరం నియోజకవర్గ వైసీపీ పరిశీలకునిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తోట రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన రామకృష్ణ.. పార్టీలో క్రియాశీలక నేతగా, ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన నియామకం పట్ల నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.