'సమస్యలు పరిష్కారం కోసం నిత్యం CPI పోరాటాలు చేస్తోంది'
BHNG: ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కారం కోసం నిత్యం సీపీఐ పోరాటాలు చేస్తోందని రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొల్లూరు రాజయ్య, CPI జిల్లా కార్యవర్గ వర్గ సభ్యులు చిగుళ్ల లింగంలు అన్నారు. శనివారం రాజపేట మండల కేంద్రంలో ఇంటింటికి సీపీఐ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అయిందని పేర్కొన్నారు.