క్లస్టర్ యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు
కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని కేవీఆర్ ప్రభుత్వ మహిళా, పురుషుల డిగ్రీ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైనట్లు రిజిస్ట్రార్ డాక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. నవంబర్ 17 నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి 24 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫీజులు సమర్పించి అడ్మిషన్లు పొందవచ్చన్నారు.