ప్రజా దర్బార్‌కు 95 అర్జీలు

BPT: చీరాలలోని క్యాంపు కార్యాలయం నందు శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ కౌతవరపు జనార్దన్ పాల్గొని ఆయా సమస్యలపై వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా దర్బార్‌లో మొత్తం 95 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. వాటిని సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుందని జనార్ధన్ తెలిపారు.